Home ఆఫ్ బీట్ ‘కోల్డ్ వాటర్ థెరపీ’కి కుర్రకారు ఓటు..

‘కోల్డ్ వాటర్ థెరపీ’కి కుర్రకారు ఓటు..

heat-Bathing

ఈ రోజుల్లో అందంగా కనపడాలి కత్తిలా ఉండాలి… కండలు పెంచేయాలని అనుకోని కుర్రకారుంటారా…? సరదాగానో సీరియస్‌గానో జిమ్‌ల్లో దూరి తెగ వ్యాయామాలు చేసేస్తారు. చెమటలు చిందేలా  కసరత్తులు చేశాక ఎవరైనా అలసిపోవడం సహజమే. అప్పుడేం చేయాలి? చల్లని ‘కోల్డ్ వాటర్ థెరపీ’కి ఓటేయాలి. అవును మీరు వింటున్నది నిజమే. దీన్నే క్రయోథెరపీ అని కూడా అంటున్నార్లెండి. అలసట తీరడానికీ, పునరుత్తేజం కలగడానికీ ఈ థెరపీ మహ బాగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. ఇప్పుడీ ట్రెండ్ జోరుమీదుంది. జిమ్‌ల, స్పాలే ఈ థెరపీ కేంద్రాలు. వీటికోసం ప్రత్యేకంగా సైరో ఛాంబర్లుంటాయి.

అక్కడ ఒక నీటి తొట్టెల్లాంటి వాటిల్లోకి వెళ్లి సేద తీరగానే విపరీతమైన వేగంతో చల్లని నీటిని వదులుతారు. చలి కాచుకోవడానికి అంతకుముందే శరీరాన్ని టవల్‌తో చుడతారు. మైనస్ 100 డిగ్రీల చలిలో దాదాపు 15 నిమిషాల పాటు అలాగే ఉంటే థెరపీ పూర్తైనట్లు. ఇంతకి దీంతో ఏం లాభం అనుకుంటున్నారా..!  మన చర్మం కింద పొరల్లోని మృతకణాలు తొలగిపోతాయి. నునుపైన కాంతివంతమైన కొత్త చర్మం తయారవుతుంది. అది కాక పైగా శరీరం అంతర్భాగాల్లో మనకు తెలియకుండా ఉన్న వాపులు మటుమాయం అవుతాయంటున్నారు, ఇప్పుడు ముంబయి,ఢిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో ఈ ధోరణి చాలా ఊపందుకుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ హవా నడుస్తోంది…