Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కదం తొక్కిన యూత్ కాంగ్రెస్..!

ఖాదీపై మోడీ, పెద్ద నోట్ల రద్దుపై నిరసన బాట
గాంధీ విగ్రహానికి పాలాభిషేకం, ఆర్‌డిఒ కార్యాలయం
ముందు ధర్నా, వినతి పత్రం సమర్పణ

Gandhiji

మంథని: ఖాదీ బొర్డు క్యాలెండర్‌పై మహత్మ గాంధీ ఫోటో స్థానంలో మోదీ ఫోటోను ముద్రించడం, పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా బుధవారం యూత్ కాంగ్రెస్ నాయకులు కదం తొక్కారు. మంథని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ విలాస్‌రావు ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మంథనిలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి, నిరసన వ్యక్తం చేసి, గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీగా మంథని ఆర్డీఓ కార్యాలయం వరకు బయలుదేరి, ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

రాహుల్ గాంధీ సంధించిన ఐదు ప్రశ్నలకు ప్రధాని మోడీ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు మంథని ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఊట్ల వర ప్రసాద్ మాట్లాడుతూ.. ఖాదీ బోర్డు కాలమానిపై గాంధీ ఫోటోను తొలగించి, తన ఫోటో పెట్టుకోవడం మహత్మడుని అవమానించడమేనని, వెంటనే మోడీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చేప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు చేసి 50 రోజులు గడుస్తున్న ప్రజలకు నోట్ల కష్టాలు తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్గిగా విఫలమైందని, వెంటనే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ అందోళన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఊట్ల వర ప్రసాద్ ,మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విలాస్‌రావులతో పాటు పార్లమెంటరీ ఇన్‌ఛార్జీ జంజర్ల శేఖర్, అధికార ప్రతినిధి గడ్డం సది, ప్రధాన కార్యదర్శి బర్ల శ్రీను, ముత్తారం జడ్పిటిసి చోప్పరి సదానందం, కాంగ్రెస్ నాయకులు కోత్త శ్రీను, శశిభూషన్ కాచె, అజీంఖాన్, కాశిపేట బాపు, మంథని, ముత్తారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, బియ్యాని శివ, జెమినిగౌడ్, యాకుబ్, జాఫర్, ఆర్ల నర్సయ్య, రవిలతో పాటు పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Comments

comments