Home పెద్దపల్లి యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి

Sports

మంథని : నేటి గ్రామీణ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి, తము పుట్టిన గడ్డకు మంచి పేరు తీసు కురావాలని మంథని ఎస్‌ఐ ఉపేందర్‌రావు అన్నారు. మండ లంలో ని గుంజపడుగు గ్రామంలో సంతోషిమాత యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహించగా, గురువారం ఎస్‌ఐ చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కబడ్డీ పోటీల్లో ఆర్గనై జింగ్ టీం సంతోషి మాత యూత్ జట్టు గెలుపోందగా, రన్నరప్‌గా అబ్ధుల్ రహీం జట్టుగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వరీ, ఎంపిటిసి కుంట శ్రీను తదితరులు పాల్గొన్నారు.