Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

మొబైల్ మత్తులో యువత

Youth in mobile intoxication

ఆందోళనలో తల్లిదండ్రులు
ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్ చూసేందుకే సమయం వెచ్చిస్తున్న యువత
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్న వైనం

మన తెలంగాణ/కౌటాల: నేటికాలం యువతకు అత్యంత ఇష్టమైనది మొబైల్‌ఫోన్. నేడు మొబైల్ ఫోన్ అత్యంత ఆవస్యతకమైన పరికరంగా మారింది. కూర్చున్నచోటే అన్ని రకాల సదుపాయాలు మొబైల్ ద్వారానే అందుతున్నాయి. అందుకే దీనికి అలవాటుపడిన యువత నిత్యం ఫేస్‌బుక్, వాట్సప్,యూటూబ్, చూడడానికి అత్యంత సమయం వెచ్చిస్తూ వారి విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. మొబైల్ అత్యవసర పనులకు అవసరమే కానీ దానిని చాలా వరకు అనవసర పనులకు ఉపయోగిస్తూ వారి భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

రోజుకో రకం ఫోన్ మార్కెట్‌లో…
యువతను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు రోజుకో రకం ఫోన్‌లను మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త ఫ్యూచర్‌లతో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన సెల్‌ఫోన్‌లు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి తోడు పలు నెట్‌వర్క్ కంపెనీలు డాటాను పోటీపడి రేట్లు తగ్గిస్తుండడంతో సెల్‌ఫోన్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. సామాన్యుడికి అందుబాటులోకి ఉండడంతో వినియోగం విపరీతంగా పెరుగు తుంది. కంపెనీ పోటీ కారణంగా ధరలు తగ్గించడంతో యువత వారి సమయాన్ని అత్యధికశాతం మొబైల్ చూడానికి విని యోగిస్తున్నారు. రోజు వారి సమయంలో వారు సామాజిక వెబ్‌సైట్స్‌లు, వాట్సాప్‌లకు అత్యధిక సమయం వెచ్చిస్తున్నారు.

సెల్‌ఫోన్‌తో సెల్ఫీలు, డ్రైవింగ్‌తో ప్రమాదాలు అధికం
నేటి యువత సెల్ఫీలతో, సెల్‌ఫోన్ మాట్లాడుతూ, వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అతివేగంతో వాహనాలు నడిపేవారికంటే సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తోనే అత్యధికంగా సెల్ఫీలతో ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు చెప్తుతున్నాయి.

Comments

comments