Home హైదరాబాద్ ఉచిత శిక్షణ తరగతులు

ఉచిత శిక్షణ తరగతులు

job

మన తెలంగాణ/ముషీరాబాద్ : నిరుద్యోగ యువత సమయం వృధా చేయకుండా ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ముఠా పద్మ సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో దళిత నిరుద్యోగ యువతకు అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులపై గాంధీనగర్ డివిజన్‌లోని జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్‌లో జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళితుల కోసం ప్రభుత్వం అనేక పథకాలను తెస్తుందని, వాటిని సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఏఈఓ రాములు మాట్లాడుతూ ఎస్సీ యువత ప్రభుత్వం అందచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పిసి హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్, మల్టీమీడియా, డిజైనింగ్ తదితర శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు 90633 31531 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఒ రత్నారాణి, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ వాణి, ఉమేందర్, మహేష్, జగన్, అలీ, నాయకులు గడ్డం రమేష్, టీఆర్‌ఎస్ అధ్యక్షులు ముఠా నరేష్, ఎర్రం శ్రీనివాస్ గుప్త, పుట్ట నవీన్‌యాదవ్, రాకేష్, గుండు జగదీష్‌బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.