Home సినిమా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఎఫైర్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఎఫైర్

Affairశ్రీరాజన్ దర్శకత్వం వహిస్తూ ముఖ్య పాత్ర పోషించగా భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న వినూత్న ప్రేమ కథా చిత్రం ‘ఎఫైర్’. ప్రశాంతి, గీతాంజలి, ధనరాజ్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియోను రామ్‌గోపాల్‌వర్మ విడుదల చేయగా… ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకుడు శ్రీరాజన్, హీరోయిన్లు ప్రశాంతి, గీతాంజలి, కెమెరామెన్ కర్ణ ప్యారసాని, సంగీత దర్శకుడు శేషు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ “అవుట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘ఎఫైర్’. దర్శకుడు శ్రీరాజన్ ప్రతిభకు సినిమా అద్దం పడుతుంది అతనికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది”అని అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. చిత్ర దర్శకుడు శ్రీరాజన్ మాట్లాడుతూ యువతరానికి సినిమా తప్పకుండా నచ్చుతుందని తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో సినిమాను అనుకున్న విధంగా తీర్చిదిద్దగలిగామని చెప్పారు. ఈ చిత్రం తమకు చాలా మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకముందని హీరోయిన్లు ప్రశాంతి, గీతాంజలి పేర్కొన్నారు. షాని, సంపత్‌రెడ్డి, ఫణిరాజ్, హరిత, రాకేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌ః సోమేష్ పోచం, మాటలుః అనిల్ సిరమల్ల, పాటలుః పోతుల రవికిరణ్.