Home సినిమా యూట్యూబ్‌లో అదిరిపోయేలా క్లిక్స్

యూట్యూబ్‌లో అదిరిపోయేలా క్లిక్స్

chiruఒక సినిమాకు సంబంధించి ట్రైలర్‌కో, టీజర్‌కో యూట్యూబ్‌లో విపరీతమైన క్లిక్స్ రావడంలాంటివి చూస్తూనే ఉంటాం. కానీ మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి సంబంధించిన ప్రతి సందర్భానికి యూట్యూబ్‌లో అదిరిపోయేలా క్లిక్స్ వస్తున్నాయి. ఈ చిత్రం టీజర్‌తో మొదలైన ఈ స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ టీజర్‌కు ఇప్పటికే ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఓ వారం క్రితం రిలీజైన ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు…’ ఆడియో సింగిల్‌కు అయితే ఎవరూ ఊహించని రేంజ్‌లో వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే ఐదు మిలియన్ల వ్యూస్ దాటిపోయి దూసుకుపోతోంది ఈ సింగిల్. ఇక శనివారం సాయంత్రం విడుదల చేసిన ‘సుందరి సాంగ్…’ పరిస్థితి కూడా ఇంతే. తెల్లారేసరికి ఒక మిలియన్ వ్యూస్ దాటిపోయాయంటే… చిరంజీవి కంబ్యాక్ మూవీపై అభిమానులు ఎంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. ప్రమోషన్స్ విషయంలో సినిమా యూనిట్ వేస్తున్న ఎత్తులు బాగా వర్కవుట్ అవుతున్నాయనే చెప్పాలి. రోజురోజుకు ‘ఖైదీ నంబర్ 150’కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోంది. ఇప్పుడు జనవరి 4వ తేదీన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను విజయవాడలో చేయబోతున్నట్లు అధికారికంగానే ప్రకటించేశారు. ఇదంతా చూస్తుంటే… రిలీజ్ అయ్యాక ఈ చిత్రం ఎన్నెన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సిందేనని అంటున్నారు సినీ ప్రముఖులు.