Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

యూట్యూబ్‌లో మరో అదిరిపోయే ఫీచర్…

Youtube

సోషల్ మీడియా దిగ్గజ వెబ్‌సైట్ యూట్యూబ్ తన వినియోగదారుల కోసం త్వరలోనే మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఇకపై ఎవరైనా నేరుగా యూట్యూబ్‌లో లైవ్ వీడియో పెట్టొచ్చు. ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ మాదిరిగానే ఇది కూడా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే కెమెరాలతో, అదే కంప్యూటర్‌లో అయితే వెబ్‌క్యామ్ ద్వారా పెట్టవచ్చు. దీంతో అదనపు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరికరాల వినియోగం తగ్గనుంది. శాంసంగ్, మోటోరోలా, ఎల్‌జి, అసుస్, నోకియా మొబైల్స్‌లో యూట్యూబ్ వాడే వారికి అతి త్వరలో ఈ లైవ్ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం గూగుల్ దీన్ని అంతర్గతంగా పరిశీలిస్తుంది.

YouTube live streaming gets easier from computers and phones.

Comments

comments