Home ఆంధ్రప్రదేశ్ వార్తలు గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్

గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్

jagan-And-Narasimhanహైదరాబాద్: వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్‌ ను కలిశారు. తనను వైసిపి శాసనసభా పక్ష  నేతగా తమ పార్టీ ఎంఎల్ ఎలు ఎన్నుకున్నారని ఈ క్రమంలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన గవర్నర్ ను కోరారు. ఈ మేరకు తనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ఎంఎల్ఎలు చేసిన తీర్మాన పత్రాన్ని గవర్నర్ కు అందిచారు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌‌తో జగన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా 30వ తేదీన తన ప్రమాణస్వీకారానికి రావాలని కెసిఆర్‌ను ఆహ్వానించనున్నారు. ఆదివారం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.
YS Jagan Meets Governor ESL Narasimhan At Raj Bhavan