Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఈ నెల 26న ఢిల్లీకి జగన్…

ఈ నెల 26న ఢిల్లీకి జగన్…

Jagan-And-Modiఅమరావతి: వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మే26న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్‌ను మోడీ ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 30న జగన్ ఆంధ్రప్రదేశ్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే తన ప్రమాణ స్వీకారానికి రావాలని జగన్ ప్రధాని మోడీని ఆహ్వానించే అవకాశం ఉందని వైసిపి పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. అటు ప్రధాని మోడీ తన పదవికి చేసిన రాజీనామాను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. శనివారం ఎన్డీయే సమావేశం అనంతరం మోడీ ప్రమాణస్వీకార తేదీని ప్రకటించే చాన్స్ ఉందని భారతీయ జనతా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసిపి అధ్యక్షుడు జగన్ క్యాంప్ కార్యాలయంలో శనివారం శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 10.31 గంటలకు జరగనున్న ఈ భేటీలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు
ys jagan mohan reddy delhi tour on may 26