Search
Saturday 17 November 2018
  • :
  • :

అవిశ్వాసం పెట్టేందుకు వైసిపి సిద్ధం…

JAGAN

ఆంధ్రప్రదేశ్: పార్లమెంట్ సమావేశాల చివరి రోజున ఎపికు చెందిన ఎంపిలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మీడియాతో జగన్ మాట్లాడుతూ.. లోక్ సభలో అవిశ్వాసం ఎప్పుడైన పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు రాజకీయ చిత్తశుద్ధి, విశ్వసనీయత లేదని మండిపడ్డారు. టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము మద్దతిస్తామని, వైసిపి పెట్టినా చంద్రబాబు మద్దతు ఇవ్వాలని కోరారు. 2014 మార్చి 2న అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎపికి హోదా ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘానికి సంబంధం ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుకు ముందే టిడిపి ప్రభుత్వం ఏర్పడిందని, అప్పుడే పోరాడింటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నారు. హోదా ఇస్తామనే ఫ్రీ కండిషన్‌తోనే రాష్ట్రాన్ని విడగొట్టారని, రాష్ట్రాన్ని విడగొట్టొద్దని గట్టిగా విభేదించింది తామేనని జగన్ చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన పాతదేనని, ఇదే జైట్లీకి శాలువాలు కప్పింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

Comments

comments