Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వైసిపి ఎంపిలకు విజయమ్మపరామర్శ

Vijayamma

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం తమ పదవులను త్యాగం చేసి, దీక్ష చేస్తున్న ఎంపిలకు విజయమ్మ సంఘీబావం తెలిపారు. ఆదివారం ఢిల్లీకి వెళ్లి వైసిపి ఎంపిలను ఆమె పరామర్శించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎపికి హోదా కోసం పోరాడుతున్నఏకైక పార్టీ వైసిపి మాత్రమే అన్నారు.  ఎంపిలు అమరణ దీక్షలో న్యాయం, ఉందని విజయమ్మ  పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం కాదని 5 కోట్ల ఆంధ్రల హక్కు అని  తెలిపారు. తెలుగు ప్రజలంతా కలిసి కట్టుగా ఉండాలని ఆకాంక్షించిన ఎకైక వ్యక్తి రాజశేఖరరెడ్డి అని ఆమె గుర్తు చేశారు. మాటమీద నిలబడే వ్యక్తిత్వం ఆయనదని, అదే గుణం జగన్ లోనూ ఉందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా  ఉంచాలన్న ముఖ్యం ఉద్దేశంతో జగన్ శ్రమించారని, రాష్ట్రా విభజన అనంతరం కూడా ప్రత్యేక హోదా వల్లే ఎపికి న్యాయం జరుగుతుందని నమ్మిన పార్టీ వైసిపి అని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపి లాంటి పార్టీలు కలిసి ఎపిని బొమ్మగా చేసి ఆడిస్తున్నాయని విజయమ్మ ఆరోపించారు. కేవలం జగన్ ను అణగదొక్కాలన్న కారణంతోనే రాష్ట్రాన్ని విభించారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎలాంటి హామీలను నెరవేర్చలేదని చెప్పారు. తమ ఎంపిలు చేస్తున్న విరోచిత పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వలని ఈ సందర్భంగా  ఆమె కోరారు.

Comments

comments