Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

253వ రోజుకు చేరిన జగన్ పాదయాత్ర

YSRCP Chief Jagan Padayatra at Visakhapatnam

విశాఖపట్నం : వైసిపి చీఫ్ జగన్ పాదయాత్ర సోమవారంతో 253వ రోజుకు చేరుకుంది. ఈరోజు జగన్ తన పాదయాత్రను మాడుగుల నియోజకవర్గం ములకలాపల్లి శివారు నుంచి ప్రారంభించారు. ఆయన పాదయాత్ర కొత్తపెంట, ఎ.భీమవరం, పడుగుపాలెం, ఎ.కోడూరు మీదుగా కె.కోటపాడు,జోగన్నపాలెం వరకు కొనసాగనుంది. యాత్రలో భాగంగా కె.కోటపాడులో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తన పాదయాత్రలో భాగంగా టిడిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తూ, ప్రజల సమస్యలు తెలసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

YSRCP Chief Jagan Padayatra at Visakhapatnam

Comments

comments