Search
Sunday 23 September 2018
  • :
  • :

చంద్రబాబును మైనారిటీలు ఎవ్వరూ నమ్మరు

YSCRP-Leaders

నంద్యాల: రేపటితో నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో బరిలో ఉన్న నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షం నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వైఎస్‌ఆర్‌సిపికి చెందిన ముస్లిం నేతలు ముస్తఫా, రెహ్మాన్‌ తదితరులు సిఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ముస్లిం ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెట్టాలని బాబు చూస్తున్నారని మైనారిటీ నేతలు మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబును మైనారిటీలు ఎవ్వరూ నమ్మబోరని స్పష్టం చేశారు. 85శాతం మైనారిటీలు వైఎస్‌ఆర్‌సిపితోనే ఉన్నారని తెలిపారు.

YSRCP Leaders criticizes AP CM Chandrababu Naidu.

Comments

comments