Home జాతీయ వార్తలు ఎపి అసెంబ్లీలో వైకాపా సభ్యుల ఆందోళన

ఎపి అసెంబ్లీలో వైకాపా సభ్యుల ఆందోళన

YSRCP1

అమరావతి : ఎపి అసెంబ్లీలో వైకాపా సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా పరిశ్రమలో గురువారం జరిగిన ప్రమాదంపై వైకాపా వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభం కాగానే ఈ అంశంపై చర్చించాలని వైకాపా సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం చర్చిద్దామని స్పీకర్ కోడెల చెప్పారు. కానీ వైకాపా సభ్యులు వినలేదు. స్పీకర్ పోడియం ఎక్కి స్పీకర్ పక్కనే నిల్చుని ప్లకార్డులతో నినాదాలు చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వైకాపా సభ్యుల తీరును బిజెపి, టిడిపి సభ్యులు ఖండించారు.