Home తాజా వార్తలు వైసిపి సీనియర్ నేత సోమయాజులు మృతి

వైసిపి సీనియర్ నేత సోమయాజులు మృతి

YSRCP Senior Leader DA Somayajulu Passed away Today

హైదరాబాద్‌: వైసిపి సీనియర్ నేత, పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డిఎ సోమయాజులు కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆయన  ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు.  వైసిపి అధినేత జగన్ హుటాహుటిన హైదరాబాద్ కి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. సోమయాజులు మృతి పట్ల వైసిపి నేతలు, ఇతర పార్టీల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలిసింది.