Home ఛాంపియన్స్ ట్రోఫీ యు‘వి’రాట్ విధ్వంసం : పాక్ టార్గెట్ 324

యు‘వి’రాట్ విధ్వంసం : పాక్ టార్గెట్ 324

Yuvraj-Virat

బర్మింగ్ హామ్ : పాకిస్థాన్ తో జరిగిన హోరా హోరి మ్యాచ్ లో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. ధావన్, రోహిత్, విరాట్, యువీ అర్థశతకాలు బాదీ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వర్షం కారణంగా రెండుసార్లు మ్యాచ్ వాయిదా పడింది. అనంతం డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ను 48 ఓవర్లకు కుదించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (91) శిఖర్ ధావన్ (68) జట్టుకు మంచి ప్రారంభం అందించారు. ఇద్దరు ఓపెనర్లు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శిఖర్ ధావన్ ఔట్ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (81) రోహిత్ తో కలిసి జట్టు స్కోర్ ను ముందుకు నడిపించారు. కాగా 192 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన యువరాజ్ సింగ్ (53), విరాట్ కోహ్లీ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్లతో ఇద్దరు దాదాపు ఒకే సరి అర్థ శతకాలు నమోదు చేశారు. కాగా 285 పరుగుల వద్ద యువరాజ్ ఔట్ అయ్యాడు. చివర్లో బ్యాటింగ్ కు దిగిన హార్థిక్ పాండ్య మైదానంలో మెరుపులు మెరిపించాడు. కేవలం 6 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. (3×6) దీంతో నిర్ణీత 48 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. పాక్ బౌలింగ్ లో షాదాబ్, అలీ అస్సన్ చెరో వికెట్ తీశారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం పాక్ 324 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగనుంది.