Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఆ అకాడమీపైనే విమర్శలా?: యువీ

yuvaraj-sing

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి నేతృత్వంలోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సిఎ)పై వెలువడుతున్న విమర్శలను  టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ తప్పుపట్టారు. ఆటగాళ్లు తిరిగి ఫిట్‌నెస్ సాధించి, ఫామ్ లోకి రావడానికి అకాడమీ  పాత్రపోషిస్తోందని ప్రశంసలు కురిపించారు. వేలి గాయం నుంచి కోలుకునేందుకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా ఎన్‌సిఎలో ఫిజియోల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు. ఈ సందర్భంలో అతని భుజం గాయం తిరగబెట్టి తీవ్రమైందని, దీనికి ఎన్‌సిఎ, ఫిజియోలు కారణమని పలు విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో యువీ స్పందించాడు. క్యాన్సర్ చికిత్స చేయించుకున్నతర్వాత తాను మళ్లీ మైదానంలో కాలుపెట్టడానికి అకాడమీనే సాయపడిందని అన్నారు. ఎన్‌సిఎపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో యువీ తన అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నానని చెప్పారు. తాను క్రికెట్‌లోకి పునరాగమనం చేయడానికి అకాడమీ ఎంతో సాయపడిందని తెలిపారు. ఉత్తమ సౌకర్యాలతో బిసిసిఐ స్థాపించిన అకాడమీలో ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఫిజియోలు, ట్రైనర్లు ఇందులో ఉన్నారని యువరాజ్ సింగ్ తన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

Comments

comments