Home అంతర్జాతీయ వార్తలు సిరియా శాంతి చర్చలకు సౌదీ అరేబియా విఘాతం : జారీఫ్

సిరియా శాంతి చర్చలకు సౌదీ అరేబియా విఘాతం : జారీఫ్

Mohammad-Javad-Zarifటెహ్రాన్: సిరియాతో శాంతి చర్చలకు సౌదీఅరేబియా విఘాతం కలిగించిందని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్‌తో ఇటీవల సంబంధాలను తెగతెంపులు చేసుకున్న సాకుతో సౌదీ అరేబియా సిరియా, ఇరాన్ దేశాల శాంతి చర్చ లకు ప్రతిబంధకాలు సృష్టిస్తోందని, అయితే ఆ చర్యలను ఎట్టి పరిస్థితులలోనూ సహించబోమని ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి మహమ్మద్ జవాద్ జారీఫ్ హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి శాంతి ప్రతినిధి స్టాఫన్ డీ మిస్టురా సిరియా శాంతి చర్చలపై సంప్రదింపులు జరిపేందుకు ఇక్కడకు వస్తున్న సందర్భంగా ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనను వెలువరించింది. సౌదీ అరేబియా కలిగించే ప్రతికూల ప్రభావ చర్య లను తిప్పికొడతామని జారీఫ్ హెచ్చరించారని ఆయన తరపున విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడిం చారు. ఇటీవల షియా మతగురువును సౌదీ అరేబియా ఉరితీసిన వారం రోజులకు ఇరాన్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు తెగతెంపులు అయ్యాయి. సిరియాలో దాదాపు ఐదేళ్లుగా సాగుతోన్న యుద్ధానికి ముగింపు పలికేందుకు రూపొందించిన 18 మాసాల ప్రణాళికకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మద్దతు పలికింది. దీని ఫలితంగా అంతర్జాతీయ చర్చలను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. సౌదీ అరేబియా, ఇరాన్ అగ్రరాజ్యాలతో చర్చలు జరిపాయి.