Home జిల్లాలు కులవృత్తి దైవం

కులవృత్తి దైవం

nizamand*సర్పంచ్ అయినా కుల వృత్తే ఆమె బతుకు

జుక్కల్: కులవృత్తే దైవంగా భావించే వారిలో చాల తక్కువ మంది కనిపిస్తారు. కాల క్రమేణ విదేశీ పోకడలకు పోయి కుల వృత్తులను కనుమరుగు చేసేలా సమాజం తయారైంది. సరే ఇది వేరే విషయం కాకున్నప్పటికీ కొందరు కుల వృత్తి ఉన్న దానికి లెక్కచేయని వారు కూడ లేకపోలేదు. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, డక్కలి ఇలా చాల వృత్తులు కనుమరుగవుతున్నాయి. కాని జుక్కల్ మండలంలోని పెద్దఏడ్గి గ్రామ సర్పంచ్‌గా గత సర్పంచ్ ఎన్నికల్లో బిసి మహిళ రిజర్వేషన్ రావడంతో అక్కడ మాజీ ఎంపిటిసి భార్య పద్మావతి సర్పంచ్‌గా ఎన్నికైంది. అప్పుడు కూడా భర్త ఎంపిటిసి అని ఎప్పుడు గర్వపడలేదు. ఇప్పుడు కూడా తాను సర్పంచ్‌ను అని గర్వపడటం లేదు. గౌడ కులస్తులైనందున కల్లు అమ్ముకునే జీవనం సాగించాలి. అదేవిధంగా ఇంట్లో పనులు ముగించుకున్నాక నేరుగా కల్లు దుకాణానికి వెళ్ళి కల్లు అమ్ముతోంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, సర్వసభ్య సమావేశాలు ఉన్నప్పుడు తప్పకుండా హాజరవుతుంది. తాను సర్పంచ్ కదా ఎలా కల్లు అమ్మాలి..? ఎవరైనా చూస్తే బాగుండదేమో..? ఎవరైనా ఎమైనా అనుకుంటారేమోననే వాటికి చోటివ్వకుండా ఎవరేమైనా అనుకోనివ్వండి ఈ సర్పంచ్ పదవి పోయిన తరువాతనైనా కల్లు అమ్ముకునే బతకాలి కదా? పైగా తమకు ఇదే అన్నం పెడుతుంది. ప్రజల సేవకు వారు అవకాశం ఇచ్చారు. వారికి కూడా న్యాయమే చేస్తున్నాము. ఎన్నో పంచాయతీలు (సంసారం, భూ తగాదాలు, కొట్లాటలు) పెట్టుకుని తమకు పిలిపిస్తారు. వారికి అయినంతకాడికి న్యాయంగనే మాట్లాడి ఇరువురిని నచ్చచెప్పు సంసారాలు కూలకుండా చూస్తాం. అని అంటోంది ఈ మహిళ సర్పంచ్. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు పెంచాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తమకు యేడాదికో, ఆర్నెల్లకో జీతం వస్తుందని, నెల నెల జీతం వస్తే బాగుంటుందన్నారు. మొత్తానికి ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో, అటు ఇంటిపనులతో సహ దుకాణం నడపడంతో ఆమె బిజీగా గడుపుతున్నారు. కుల వృత్తే దైవంగా భావించి ఈ సర్పంచ్ కల్లు అమ్మడం కొత్తవారికి ఆలోచింపచేస్తుంది.