Home నల్లగొండ ‘జీరో’కు కళ్ళెం

‘జీరో’కు కళ్ళెం

 5 Income Tax Department of Circle 2016/17 Financial Year

నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఏకీకృత పన్ను ద్వారా వచ్చిన ఆదాయం ఏడాదిలో నిధుల వర్షం కురిపించింది. ఇబ్బ డిముబ్బడిగా ఆదాయం వచ్చిపడడంతో వాణిజ్య పన్నుల శాఖ ఆనందోత్సా హాల మధ్య సంబరపడుతోంది. వస్తు వులు సేవల పన్ను(జీఎస్టీ) విధానం అమలులోకి వచ్చి ఏడాది పూర్తైన నేపధ్యంలో ఉమ్మడి జిల్లా వాణిజ్య పన్నుల శాఖకు రాబడి వంద కోట్లను దాటింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట, భువన గిరి, కోదాడ, మిర్యాలగూడ మొత్తం 5 ఆదాయ పన్నులశాఖ సర్కిల్‌ల ద్వారా 2016/17 ఆర్ధిక సంవత్సరంలో విలువ ఆధారిత పన్ను(వ్యాట్) ద్వారా రూ. 764కోట్లు ఆదాయం రాగా 2017/18 ఆర్ధిక సంవత్సరంలో వస్తువులు సేవల పన్ను(జీఎస్టీ) ద్వారా రూ. 874కోట్లతో 14.39శాతం మేర వృద్ధి సాధించి ఆదా యం సమకూరింది. జీఎస్టీ అమలులోకి వచ్చి తొలి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిద స్థాయిల్లో అవగా హన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేయడం ద్వారా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు మొత్తంగా 85శాతం రిటర్న్ సమర్పించడంతో ఈ ఏడాది ఏకీకృత పన్నుల ఆదాయం రూ. 110కోట్ల మేర అదనంగా వాణిజ్య పన్నుల శాఖకు చేకూరింది. దీంతో ఉమ్మడి జిల్లాలో జీఎస్టీ అమలు తర్వాత ఆశించిన మేర జీరో దందాకు కళ్ళెం పడినట్లేనని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి :
గతే డాది జూలై1న దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వచ్చిన వెంటనే తొలుత కొంత ఆటుపోట్లు ఎదుర్కొన్నా రానురాను మెల్లగా గాడిలోపడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 85శాతం వ్యాపార వర్గాలు తమ తమ రిట ర్న్‌ను దాఖలు చేయడంతోనే జీఎస్టీ ఏస్థా యిలో వసూలవుతుందో అర్ధం చేసుకోవ చ్చు.వ్యాపారులు క్రమం తప్పకుండా 5,12, 18,28 నాలుగు స్లాబ్‌ల పద్ధతిలో మూడు మాసాల పాటు రిటర్న్

నిధుల వర్షం..వాణిజ్యం ఉత్సాహం

దాఖలు చేయని పరిస్థితుల్లో నోటీసులు జారీ చేయడం ద్వా రా లైసెన్సులు రద్దు చేసేందుకు ఖచ్చిత మైన విధివిధానాలు రూపొందించడంతో వ్యాపా రులు ఎందుకొచ్చిన తలనొప్పంటూ జీఎస్టీకి మొగ్గుచూపుతున్నారని
స్పష్టమవు తోంది. ఏడాదిలో జీఎస్టీ విధానం అమలుకు వ్యాపార వర్గాల మద్దతు లభించినందున కేంద్రం ప్రత్యేక దృష్టిసారించి భవిష్యత్తులో చిన్నచిన్న వ్యాపారులు, ప్రజలకు నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకునేందుకు మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
ఏడాదిలో రూ. 110కోట్లుః ఏకీకృత పన్నుల విధానం ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ 5సర్కిల్‌ల పరిధిలో ఏడాదిలో ఏకంగా రూ. 110కోట్ల ఆదాయం సమకూరింది. ఆయా సర్కిల్‌ల పరిధిలో నల్లగొండ 3785, సూర్యాపేటలో 2,880, యాదాధ్రి భువనగిరి జిల్లాలో 1,789 కలిపి మొత్తం 8,454 మంది వ్యాపారులు తమ తమ రిటర్న్ దాఖలు చేస్తున్నారు. వీరి రిటర్న్ ద్వారా 2017-18 ఆర్ధిక సంవత్సరంలో రూ. 874కోట్ల ఆదాయం వాణిజ్య పన్నుల శాఖ ఖజానాకు చేరింది. గతేడాది విలువ ఆధారిత పన్ను(వ్యాట్) ద్వారా రూ. 764కోట్ల మేర ఆదాయం రాగా జీఎస్టీ అమలుతో 2017-18 సంవత్సరానికి రూ. 874 కోట్లకు చేరుకుంది. మొత్తతం 14.39శాతం వృద్దితో రూ. 110కోట్ల అదనపు ఆదాయం ఒక్క ఏడాదిలోనే సమకూరింది. అయితే జిల్లాల, సర్కిల్‌ల వారిగా చూస్తే నల్లగొండ జిల్లా పరంగా 2016-17లో రూ. 196కోట్లు రాగా 2017-18 సంవత్సరంలో రూ. 217కోట్లు కాగా రూ.20 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. ఇక యాదాధ్రి భువనగిరి జిల్లాలో 2016-17 సంవత్సరంలో రూ.85కోట్ల ఆదాయం రాగా 2017-18లో రూ. 102కోట్లు వచ్చాయి. ఇక సూర్యాపేట జిల్లాకు వచ్చేసరికి 2016-17లో రూ. 482కోట్లు సమకూరగా 2017-18 ఏడాదిలో రూ. 554కోట్లు ఖజానాకు చేరాయి. వ్యాపారులు సరుకుల రవాణాకు విధిగా వేబిల్లులు ఖచ్చితంగా పొందుతుండడంతో ఇంతమొత్తంలో ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొంటున్నారు. జీఎస్టీ అమలులో ఏడాది కాలం పూర్తైనా సర్వర్‌లో సాఫ్ట్‌వేర్ సమస్యలు అడపాదడపా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వ్యాపార వర్గాలు, డీలర్‌లు వాపోతున్నారు. ప్రస్తుతమున్న స్టాబ్ ల విధానాన్ని క్రమబద్దీకరించడం ద్వారా స్లాబ్‌లు కూడా తగ్గించాలన్న వాదన వ్యాపార వర్గాల నుంచి వినవస్తుంది. మొత్తానికి ఆదాయం అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో ఖజానాకు సమకూరడంతో ఇటు ఉమ్మడి జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, అటు ప్రభుత్వాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.