Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

జింబాబ్వే అధ్యక్షుడిపై బాంబు దాడి…

inage
జింబాబ్వే: అధ్యక్షుడు ఎమ్మర్సన్‌ మన్నగాగ్వ శనివారం జరిగిన బాంబుదాడిలో తృటిలో తప్పించుకున్నారు. జులై 30న ఆ దేశంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సభ నిర్వహించారు. ఎమ్మర్సన్‌ మన్నగాగ్వనే లక్ష్యంగా  ఈ బాంబు దాడి జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మర్సన్‌ ప్రసంగం ముగిసిన కొద్ది సమయానికే బాంబు పేలింది. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించాయి. ఈ సంఘటనలో ఉపాధ్యక్షుడు చివాంగతో పాటు ఆయన భార్య కు గాయాలయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మరికొందరు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

Comments

comments