Home తాజా వార్తలు స్థానిక వ్యయ పరిమితులు

స్థానిక వ్యయ పరిమితులు

ZPTC, MPTC Electionsజడ్‌పిటిసి అభ్యర్థి ప్రచార ఖర్చు రూ.4లక్షలు, ఎంపిటిసి రూ. 1.50లక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్: రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల విధులు, మార్గదర్శకాలను నూ తన పంచాయతీరాజ్ చట్టం ద్వారా అ మలుచేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. పో లింగ్ సమయంలో ఓటర్లు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల దగ్గర లైన్‌లో వేచిచూడాల్సిన పనిలేకుండా చర్యలు తీసుకోవాలని సూ చించింది. దీనికోసం వారం మందుగానే ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని, వెంటనే ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయే విధంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పరిషత్ ఎన్నికల పోలింగ్‌ను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. పరిషత్ ఎన్నికల నిర్వహణపై స్టేజ్-1, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు, ప్రి సైడింగ్ అధికారుల విధులు, బాధ్యతలను ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాల్లో పలు అంశాలను కీలకంగా పేర్కొంది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం విధు లు, బాధ్యతలను ఖరారుచేసిన ఎన్నికల సంఘం, పోలింగ్ వాయిదా, రద్దుపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

జెడ్పీటిసికి రూ.5,000, ఎంపిటిసికి రూ.2,500

ఇదివరలో బరిలో నిలిచిన అభ్యర్థులు చనిపోతే పోలింగ్‌ను రద్దుచేయడమో లేక వాయిదా వేసేవారు. ప్రస్తుతం ఎన్నికలకు ముందు చనిపోతే పోలింగ్ వాయిదా వేయాలని నిర్ణయించారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత చనిపోతే మాత్రం వాయిదా వేయాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. అదేవిధంగా వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, ఓటరు జాబితా వంటి అతి ముఖ్యమైన ఎన్నికల సామగ్రి పొందనప్పుడు, లేదా దెబ్బతిన్నప్పుడు, నష్టపోయినప్పుపడు పోలింగ్‌ను రద్దుచేసే బాధ్యత ప్రిసైడింగ్ అధికారికి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మార్గదర్శకాల్లో భాగం గా పోలింగ్‌ను రద్దుచేసే అంశాలపై పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు డిపాజిట్ల మొత్తాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది.

జెడ్పీటిసి అభ్యర్థి ప్రచార ఖర్చు కు రూ.4లక్షలు, ఎంపిటిసి ఖర్చు రూ.1.50లక్షల వ్య య పరిమితిని విధించారు. ఈ ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికల తరహాలోనే, ఎస్టీ, ఎస్సీ, బిసిలకు డిపాజిట్ సొమ్మును సమం చేశారు. జనరల్ అభ్యర్థులు జెడ్పీటిసి స్థానాల్లో రూ.5,000, ఎంపిటిసి స్థానాల్లో రూ. 2500 డిపాజిట్‌గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బిసి అభ్యర్థులైతే రూ.2,500, రూ.1,250 చెల్లించాల్సి ఉంటుంది.

జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్, అదనపు ఎన్నికల అధికారిగా జేసీ

పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగి, పోలింగ్ కొనసాగించే పరిస్థితి లేనప్పుడు, మార్గమధ్యంలో పోలింగ్ సిబ్బంది, అధికారులకు ఆటంకాలు కలిగినప్పుడు, ఇతర ఇబ్బందుల కారణంగా పోలింగ్‌పార్టీలు అందుబాటులో ఉండనప్పుడు, ఇతర హేతుబద్ధమైన కారణాలతో పోలింగ్‌ను వాయిదా వేసే అధికారం ప్రీసైడింగ్ అధికారులకు ఉంటుంది. జెడ్పీటిసి రిటర్నింగ్ అధికారిగా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి తక్కువ కాకుండా గెజిటెడ్ ఉద్యోగులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జెడ్పీటిసి స్థానానికి ఒక రిటర్నింగ్ అధికారి, ప్రథమ శ్రేణి గెజిటెడ్ స్థాయికి తక్కువ కాకుండా ఉండే ప్రభుత్వ ఉద్యోగిని, ఎంపిటిసి స్థానాలకు రిటర్నింగ్ అధికారులుగా నియమిస్తారు.

ప్రతి 3 ఎంపిటిసిలకు ఒక ఆర్వో ఉంటారు. ఎంపిటిసి స్థానాల రిటర్నింగ్ అధికారులు, జెడ్పీటిసి స్థానానికి ఉండే ఆర్వోకు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహారిస్తారు. ఇక ఎంపీటీసీ స్థానానికి ఆర్వోగా ఉండే అధికారికి సహాయకుడిగా సూపరింటెండెంట్ స్థాయి అధికారిని నియమించుకునేందుకు అవకాశం కల్పించారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు రెండు దశల్లో రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులను నియమిస్తున్నట్లు ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో సూచించింది. జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు ఎన్నికల అధికారిగా జేసీ, జెడ్పీ సీఈఓ, డిపిఓలు వ్యవహరిస్తారు. డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారిగా ఆర్డీవో, సబ్ కలెక్టర్ ఉండనున్నారు. సహాయ ఎన్నికల అధికారులుగా ఎంపీడీవో, తహసీల్దార్లు వ్యవహరించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసినప్పటినుంచి గుర్తులు కేటాయించేవరకు రిటర్నింగ్ అధికారులదే బాధ్యతగా ఎన్నికల సంఘం పేర్కొంది.

కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం
వ్యయపరిమితి పెంపు..

1995 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి జెడ్పీటిసి అభ్యర్థి రూ.2లక్షలు, ఎంపీటిసి అభ్యర్థి లక్ష రూపాయల ప్రచార ఖర్చు పరిమితిగా ఉండేది. కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018 అమల్లోకి వచ్చిన తర్వాత వ్యయ పరిమితిని పెంచారు. జెడ్పీటిసి అభ్యర్థి రూ.4లక్షలు, ఎంపీటిసి అభ్యర్థి రూ.1.50లక్షలు ఖర్చు పెట్టుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అది కూడా బ్యాంకు ఖాతానుంచే ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థుల డిపాజిట్ రూ.5,000, రూ.2,500, ఇతర కేటగిరీలకు రూ. 2,500, రూ.1,250 స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల డిపాజిట్లను ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఒకే రకంగా డిపాజిట్ తీసుకోనున్నారు.

జెడ్పీటిసి స్థానానికి పోటీచేసే జనరల్ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ, బిసిలైతే రూ.2,500 డిపాజిట్‌గా చెల్లించాలి. ఎంపీటిసి స్థానాలకు పోటీచేసే జనరల్ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బిసిలు అయితే రూ.1,250 డిపాజిట్ చెల్లించాలి. పోలింగ్, లెక్కింపు ప్రక్రియ అనంతరం చెల్లుబాటు అయిన ఓట్లల్లో 8వ వంతు ఓట్లు పొందినవారికే నామినేషన్ సమయంలో డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఇవ్వనున్నారు. అంతకన్నా తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ మండల పరిషత్ ఖాతాలోకి వెళ్తుంది.

ZPTC, MPTC Elections 2019