Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

భయం…భయం…

 Zuckal SC boys Hostel in the state of disarray

జుక్కల్: యేళ్ళ తరబడి శిథిలావస్థకు చేరుకున్న జుక్కల్ ఎస్‌సి బాలుర వసతి గృహం యొక్క భవనానికి పట్టించుకునేవారు లేక విద్యార్థులు అందులో ఉండటానికి భయపడుతున్నారు. మరీ అధ్వాన స్థితిలో ఉండి పెచ్చులూడిపోతుండటంతో విద్యార్థులు పక్కనే ఉన్న ఎస్‌సి కమ్యూనిటి హాల్‌లో నిద్రాస్తున్నారు. భవనం పైభాగం కిందికి వంగినట్లు కనిపించడంతో పాటు పెచ్చులూడుతుండటంతో విద్యార్థులతో పాటు వార్డెన్ కూడ అందులో గంట సేపు ఉండటానికి కూడ భయంతో వణికిపొతున్నారు. రూముల్లోని సామాన్లు పెట్టుకునే సామూహిక పెట్టెని బయటకు తీసుకువచ్చి అందులోనే సామాన్లు ఉంచుకుంటున్నారు. కేవలం అందులో అన్నం తినే సమయం తప్ప మిగత సమయంలో ఆ భవనంలో ఉండేందుకు ఎవరు కూడ సాహసించడం లేదు. ఈ హస్టల్లో సుమారు 60 మంది విద్యార్థులు ఉంటారు.

రాత్రుల్లో కమ్యూనికిటి హాల్‌లోని ఒకే రూములో ఒకరికి ఆనుకుని ఒకరు ఇరుకుగా నిద్రిస్తున్నారు. హస్టల్‌కు ఉన్న మైదానంలో నిర్మించిన బాత్‌రూములు కూడా శిథిలమయ్యయి. లెట్రిన్ సెప్టిక్ ట్యాంక్ నిండిపోవడంతో బయటకు వెళ్ళె మార్గం లేకపోవడంతో వార్డెన్ ప్రవీణ్ ఒక మోటారు తీసుకువచ్చి వారానికి ఒక సారి నిండినప్పుడు తీసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత నాలుగేళ్ళుగా కనీసం మరమ్మత్తులు చేయాలని తాను సంబంధిత అధికారలకు, ప్రజాప్రతినిధులకు లెటర్ ఇచ్చిన ఫలితం కనిపించలేదంటున్నారు. చుట్టు ప్రహరి కూడ కూలిపోయిందని,దానికి ఎలాంటి రక్షణ లేకపోవడంతో పశువులు, కుక్కలు లోపలికి వచ్చి స్వైర విహారం చేస్తున్నాయంటున్నారు. ప్రస్తుతం వర్షకాలం కావడంతో ఒక్క నిమిషం కూడ అందులో ఉండటానికి మనసొప్పడం లేదని వారు పేర్కోంటున్నారు. పైన స్లాబు ఉన్నప్పటికి దానికి సైడ్‌వాల్స్ లేకుండా ఉన్నందున పిల్లలకు ప్రమాదం ఆయ్యే అవకాశాలు కూడ ఉంటాయంటున్నారు. ఈ భవనాన్ని తాత్కలిక మరమ్మత్తులు చేపట్టకుండా కూల్చివేసి ఇదే స్థలంలో నూతన భవనం నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Comments

comments