- Advertisement -
బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు, వరంగల్ సభ తర్వాత కొత్తగా సభ్యత్వాలు తీసుకుంటామని మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పారు. శనివారం తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ నేతలతో కెటిఆర్ సమావేశమయ్యారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాలు, వరంగల్ బహిరంగ సభపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. అక్టోబర్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని తెలిపారు. అలాగే, ఇకపై డిజిటల్ సభ్యత్వాలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. కార్యకర్తలకు ట్రైనింగ్ ఇప్పిస్తామని.. కార్యకర్తలకు విషయాలపై అవగాహన ఉంటేనే మాట్లాడగలరన్నారని కెటిఆర్ అన్నారు.
- Advertisement -