Monday, December 23, 2024

అన్నదానం గొప్పది

- Advertisement -
- Advertisement -
  • డిసిసిబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా

కడ్తాల్: అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పదని డీసీసీబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. సనాతన ధర్మాన్ని, మానవతా విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. కడ్తాల మండల కేంద్రాలో సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ రంగారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకోని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షుడు యాచారం వెంకటేశ్వర్ల గౌడ్‌తో కలిసి డీసీసీబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా ప్రారంభించారు.

గడిచిన ఏడాది కాలంగా క్రమం తప్పకుండా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోషకాలతో కూ డిన బోజనం అందించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కోరివి వెంకటయ్య, గోవర్థన్, రంగారెడ్డి, రమ్యశ్రీ, రాజేందర్, వెంకటేష్, మోహన్‌రెడ్డి, రాజు, లక్ష్మయ్య తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News