Monday, January 20, 2025

ఇంటర్ ఆడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ సజావుగా జరగాలి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కో ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 12 నుంచి 20వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ సెకెండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2ః30 గంటల నుంచి సాయంత్రం 5ః30గంటల వరకు జరుగుతాయన్నారు.

ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 10,634 మంది సెకెండియర్ పరీక్షలకు 4,728 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని,144 సెక్షన్ విధించాలని పరీక్ష కేంద్రాల పరిసరాలలో గల ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా సూచించాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసి అధికారులు బస్సులు నడపాలని పరీక్ష కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లు అత్యవసర మందులతో ఒక ఎఎన్‌ఎంను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు.

పరీక్ష సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. పోలీసులు జవాబు పత్రాలను సరిగ్గా రిసీవ్ చేసుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్ టాయిలెట్స్ మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్‌పి సిఇఓ ఎల్లయ్య, డిఐఓ గోవింద్‌రామ్, డిఆర్‌ఓ నగేష్, డిఎస్‌పి రవీంద్రారెడ్డి, ఆర్‌డిఓ రవీందర్‌రెడ్డిలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News