Saturday, November 23, 2024

ఇక వరద ప్రయాణానికి స్వస్తి.. సీదా ప్రయాణమే…

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: నియోజకవర్గంలోని నంగునూర్ మండలంలోని దర్గాపల్లి గ్రామం వద్ద హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.7కోట్ల 15 లక్షల నిధులు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంగునూర్ మండలంలోని దర్గపల్లి గ్రామం వద్ద ప్రస్తుతం లో-లెవల్ పైపు కాలువ ఉందని వర్షాకాలంలో భారీ వర్షాలు పడటంతో రోజుల తరపడి ప్రయాణానికి అంతరాయం ఏర్పడిందన్నారు. గత సంవత్సరం వర్షాలకు పెద్ద పెద్ద వాహనాలు వరదలో కొట్టుకపోయాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని దర్గపల్లి గ్రామం వద్ద హై లెవెల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న బ్రీడ్జ్ ప్రతి వానాకాలంలో చిన్న వర్షం పడ్డా రోడ్డుపై వెళ్లే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇటీవల కురిసిన వర్షానికి పూర్తి స్థాయిలో దెబ్బతిందని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న దాని కంటే ఎక్కువ ఎత్తులో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఎన్నో ఏళ్ల నుండి బ్రీడ్జ్ కావాలి అని ఈ బ్రీడ్జ్ నిర్మాణం జరిగితే ప్రయోజనం పొందే గ్రామాల ప్రజలకు ఉండేదన్నారు. ఈ బ్రీడ్జ్ పూర్తి అవుతే చిన్నకోడూర్ మండలంలోని మాఛాపూర్, సలంద్రి, చౌడారం, మేడిపల్లి, మల్లారం, సికిందళాపూర్, దర్లపల్లి, బద్దీపడగా, సిద్దన్నపేట మరియు దగ్గరి గ్రామాల ప్రజల ప్రయాణానికి ఎంతో ప్రయోజనము కానుందని చెప్పారు. గ్రామాల ప్రజల ప్రయాణానికి ప్రయోజనంగా ఉంటుందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభంచి బ్రీడ్జ్ అందుబాటులో వస్తాయని చెప్పారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News