Wednesday, January 22, 2025

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు బండి సంజయ్ హామీ..

- Advertisement -
- Advertisement -

 

Bandi Sanjay meets parents of students stuck in Ukraine

హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కలుసుకుని, పిల్లలను సురక్షితంగా తీసుకువస్తామని వారికి హామీ ఇచ్చారు. రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్‌లో ఒంటరిగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తల్లిదండ్రులను వ్యక్తిగతంగా కలుసుకుని, వారిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కూపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పిల్లల తల్లిదండ్రులకు తన మద్దతు, సంఘీభావం తెలిపారు. తెలంగాణ విద్యార్థులు క్షేమంగా తిరిగి రావడానికి బిజెపి రాష్ట్ర సెల్ తల్లిదండ్రులు, అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు.

Bandi Sanjay meets parents of students stuck in Ukraine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News