Monday, December 23, 2024

కంటి వెలుగు దేశానికే ఆదర్శం: ఎంఎల్ఎ శానంపూడి

- Advertisement -
- Advertisement -

గరిడేపల్లి ః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పధకం దేశానికే ఆదర్శనీయమని ఎంఎల్ఎ శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం మండంలోని గరిడేపల్లిలో కంటి వెలుగు పథకాన్ని ప్రారంబించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన కంటి వెలుగు పధకాన్ని భవిష్యత్‌లో భారత రాష్ట్ర సమితి ఆద్వర్యంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తారన్నారు. ప్రజలందరూ అభివృద్దిని గుర్తించాలన్నారు. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలను చూసి వారి వారి రాష్ట్రాలలో అమలు చేస్తుందన్నారు.

కంటి సమస్యలు ఉన్న పిల్లలు,పెద్దలు అందరూ కంటి పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనల మేరకు కళ్ళజోడు,ఆపరేషన్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్,సర్పంచ్ త్రిపురం సీతారాంరెడ్డి,ఎంపీడీవో వనజ,ఎంపీవో భద్రయ్య, ఎంపీటీసి కడియం స్వప్న వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్ షేక్ సైదాబి రాజ్‌మహ్మద్,వార్డు సభ్యులు నారాయణ,రాంరెడ్డి, పిట్ట జానమ్మ,ఎడవల్లి లక్ష్మీ,మేకపోతుల శ్రీను,కానుగు దుర్గ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News