- Advertisement -
దళితులు అంబేద్కర్ నుంచి స్ఫూర్తిని పొంది అలాంటి పార్టీల నుంచి దూరం కావాలన్నారు.
లక్నో: హర్యానా అసెంబ్లీ జరుగబోయే ముందు బిఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ పార్టీ నుంచి దళితులు సంబంధాలు తెంచుకోవాలని అన్నారు. అలాగే ఇతర కుల పార్టీల నుంచి కూడా దూరంగా ఉండాలని కోరారు. దళితులు అంబేద్కర్ బాటలో నడవాలన్నారు.
హర్యానాలో దళితులకు అనుకూలంగా ఉండే ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్ డి)తో పొత్తు పెట్టుకునే యత్నంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వంటి సందర్భాల్లోనే కాంగ్రెస్, ఇతర కుల పార్టీలు దళితులను ఉపయోగించుకుని, తర్వాత వారిని దూరం పెడుతున్నాయని ఆమె ఎక్స్ లో అనేక పోస్టులు పెట్టారు. తమని దూరంగా ఉంచే అలాంటి పార్టీలను దూరం పెట్టాలని, అంబేద్కర్ నుంచి స్ఫూర్తిని పొందాలని కూడా ఆమె కోరారు.
- Advertisement -