Monday, January 20, 2025

తండ్రిని కారుతో ఢీకొట్టి చంపి… తమ్ముడికి ఫోన్ చేసి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆస్తిలో వాటా ఇవ్వలేదని తండ్రిను కుమారుడు కారుతో ఢీకొట్టి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మదనపల్లె మండల కేంద్రంలోని పుల్లారెడ్డి వీధులో మీరుగట్టు చిన్నరెడ్డప్ప రెడ్డి(65) తన ఇద్దరు కుమారుడు రఘునాథ్ రెడ్డి, శంకర్ రెడ్డితో కలిసి ఉంటున్నాడు. శంకర్ రెడ్డి బెంగళూరు స్టాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుండగా పెద్ద కుమారుడు రఘునాథ్‌రెడ్డి ఆన్ లైన్ ట్రేడింగ్ చేసేవాడు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో 16 లక్షల రూపాయలు నష్టం రావడంతో తన తండ్రిని తన వాటా ఇవ్వాలని పలుమార్లు పెద్ద కుమారుడు అడిగాడు. దీంతో తండ్రీ కుమారుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. తనవాటా ఇవ్వకపోవడంతో తండ్రిపై కుమారుడు పగ పెంచుకున్నాడు. చిన్నరెడ్డప్పరెడ్డిని కుమారుడు రఘునాథ్‌రెడ్డి కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. అనంతరం తన తమ్ముడు శంకర్‌రెడ్డికి సమాచారం ఇచ్చాడు. శంకర్‌రెడ్డి తన బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిన్నరెడ్డప్ప కోసం గాలింపు చర్యలు చేప్టటారు. గురువారం తెల్లవారుజామున వీవర్స్ కాలనీ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో చిన్నరెడ్డప్ప మృతదేహాన్ని గుర్తించారు. శంకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేప్టటారు. రఘునాథ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News