Monday, December 23, 2024

తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహం

- Advertisement -
- Advertisement -

మున్సిపాలిటీ తీర్మానానికి హెచ్‌ఎండిఎ ఆమోదం
స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండిఏ ఆమోదించింది. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్నిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేయడంతో దానిని హెచ్‌ఎండిఏ ఆమోదించింది. విగ్రహ ఏర్పాటుకు కావాల్సిన స్థలం హెచ్‌ఎండిఏ పరిధిలోకి రావడంతో అనుమతులకు కొంత జాప్యం జరిగినట్టు తెలుస్తోంది.
నేడు భట్టి చేతుల మీదుగా ఆవిష్కరణ
అయితే ఎట్టకేలకు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ స్థలం కేటాయించాడంపై గద్దర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31న గద్దర్ విగ్రహాన్ని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఇటీవల తెల్లాపూర్‌లో అఖిలపక్షం నాయకులు గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకోగా, పలు సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ఈ వివాదంపై స్పందించిన ప్రభుత్వం గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ప్రజా యుద్ధ నౌకగా పేరుగడించిన గద్దర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు టిపిసిసి చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం గద్దర్ అంతిమయాత్రలో అన్నీ తానై ముందుకు నడిపించారు. గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న రేవంత్ భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమయాత్ర, అంత్యక్రియలు ఇలా అన్నింటిలో ముందుండి నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగినప్పటికీ అక్కడ అన్నీ చూసుకుంది రేవంత్ రెడ్డే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News