Monday, December 23, 2024

దొంగతనం చేశాడని బాలుడిని కట్టేసి కారం చల్లి కొట్టాడు…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : శీతలపానియం దొంగతనం చేశాడంటూ బాలుడిపై యజమాని దాడి చేసిన సంఘటన హైదరాబాద్‌లోని నాంపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణ అనే వ్యక్తి నాంపల్లిలో దుకాణం నడుపుతున్నాడు.ఓ బాలుడు అతడి దుకాణంలో బాలుడు శీతలపానియం దొంగతనం చేయడంతో సదరు బాలుడిని చిత్రహింసలకు గురిచేశాడు. దుస్తులు తీసి చేతులు , కాళ్లు కట్టేసి కారం చల్లి కొట్టడంతో పాటు వీడియో తీసి కిరాణషాపు యజమాని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సదరు యజమానిపై హబీబ్‌నగర్ పోలిస్‌స్టేషన్‌లో బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News