Wednesday, December 25, 2024

నాలుగో రోజు రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఈడి

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) ప్రశ్నించింది. రాహుల్ గాంధీ గట్టి భద్రత మధ్య ఎపిజె అబ్దుల్ కలామ్ రోడ్డులని ఈడి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఆఫీసు చుట్టూ 144 సెక్షన్‌ను విధించారు. పెద్ద ఎత్తున పోలీసు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. గత వారం మూడు రోజుల్లో దాదాపు 30 గంటలు ఎంపీ రాహుల్ గాంధీ ఈడి కార్యాలయంలో గడిపారు. అక్కడ ఆయనని అనేక రకాల ప్రశ్నలు వేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్‌ఏ) కింద ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. నేసనల్ హెరాల్డ్ పత్రికకు కాంగ్రెస్ పార్టీ రుణం ఇవ్వడం, నిధులు బదలీ చేయడం తదితర ప్రశ్నలను రాహుల్ గాంధీకి వేసి ఈడి అర్థం చేసుకుందని భోగట్టా. ప్రశ్నించేందుకు సోనియా గాంధీని కూడా పిలిచారు. కానీ ఆమె కొవిడ్ కారణంగా ఆసుపత్రిలో ఉండడం వల్ల విచారణ తేదీ వాయిదా వేశారు. కాగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల వారిని లక్షం చేసుకుంటున్నారని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News