Tuesday, December 24, 2024

నీట్ పరీక్ష వాయిదా..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- పోస్ట్ గ్రాడ్యుయేషన్ (నీట్ పిజి) పరీక్షను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎనిమిది వారాల పాటు వాయిదా వేసింది. మార్చి 12న నిర్వహించాల్సిన నీట్ పిజి పరీక్ష రోజు.. నీట్ పిజి- 2021 కౌన్సెలింగ్ జరగనున్న దృష్టా నీట్ పిజి పరీక్షను వాయిదా వేయాలని వైద్యుల నుంచి వినతుల మేరకు వాయిదా వేసినట్లు ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్ శుక్రవారం ఉత్తర్వుల్లో తెలిపారు. నీట్ పిజి 2022 పరీక్షను ఆరు నుంచి ఎనిమిదివారాల పాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బిఈ) నిర్వహిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News