Thursday, December 26, 2024

నెల క్రితం వివాహం… నవ వధువుకు నాలుగు నెలల గర్భం…

- Advertisement -
- Advertisement -

లక్నో: నెల క్రితం వివాహం జరిగిన వధువుకు నాలుగు నెలల గర్భం ఉండడంతో అత్తింటి వారు షాకైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ యువతితో మహారాజ్ గంజ్ జిల్లాకు చెందిన యువకుడి గత నెలలో పెళ్లి జరిగింది. వివాహం అయిన తరువాత దంపతులు కలిసి మెలిసి ఉంటున్నారు. నవ వధువు కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో ఆమెన అత్తింటి వారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె నాలుగు నెలల గర్భవతి అని చెప్పడంతో అత్తమామ, భర్త కంగుతిన్నారు. వెంటనే మోసపోయామని గ్రహించిన భర్త స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను తల్లి గారింటికి పంపించారు. గర్భం గురించి ముందే తెలిసినప్పటికి వివాహం జరిపించారని అత్తింటి వారు మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News