Tuesday, January 21, 2025

పవన్ స్ట్రాటజీ వల్లే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచాం: లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పవన్ స్ట్రాటజీ వల్లే గెలిచామని బిజెపి సీనియర్ నాయకుడు లక్ష్మణ్ చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఈనెల 7వ తేదీన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నట్లు చెప్పారు.

తెలుగుదేశం పార్టీ మా భాగస్వామి కాదని.. జనసేన మా భాగస్వామ్య పార్టీని అన్నారు. పరస్పర లాభాలు ఉంటేనే పొత్తులు ఉంటాయని… తెలంగాణలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తారని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పవన్ స్ట్రాటజీ వల్లే గెలిచిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగిందని ఆయన అన్నారు. పొత్తుల్లో కొన్ని సీట్లు ఇతర పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుందని.. రాష్ట్ర ప్రయోజనాలే కాదు, దేశ ప్రయోజనాలు కూడా చూస్తామని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News