Thursday, January 23, 2025

పిడుగు పాటుకు కాడెద్దులు మృతి

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని నుచ్చుకుంట తాండాకు చెందిన సింగల్ విండో డైరెక్టర్ డోల్యనాయక్ వ్యవసాయ పోలంలో ఆదివారం అర్ధరాత్రి పిడుగుపాటుకు రెండు కాడెద్దులు మృతి చెందాయి. సోమవారం ఉదయం పోలానికి వెళ్లి చూడగా రెండు ఎద్దులు విగత జీవులుగా పడి ఉన్నాయి. దీంతో చనిపోయిన ఎద్దులను చూసి రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎద్దుల విలువ సుమారు 90 వేలు ఉంటుందని తెలిపారు.

బాధిత రైతును సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, పరామర్శించి, 10 వేల రూపాయల సాయాన్ని అందించారు. మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్‌నాయక్, జిల్లా ఎస్సీ, ఎస్టీ స్టాండింగ్ కమిటి సభ్యుడు నేనావత్ పత్యనాయక్‌లు పరామర్శించారు. ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామని రైతు డోల్యనాయక్‌కు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News