Thursday, January 23, 2025

పెళ్లికి నిరాకరించిందని కత్తితో దాడి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మియాపూర్: ప్రేమించిన ప్రియురాలిపై కత్తితో దాడి చేసి అడ్డు వచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేసి అనంతరం అతని గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, మియాపూర్ ఇన్స్‌పెక్టర్ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరు జిల్లా రేపల్లేకు చెందిన వైభవి (19), సందీప్ గత 3 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. వారి ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. వారి మధ్య మనస్పర్థలు రావడంతో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం రద్దు చేసుకొని విడిపోయారు.

ప్రియురాలు దూరంగా పెట్టడంతో సహించలేకపోయిన సందీప్ రోజు తనకు ఫోన్ చేసి విసిగించేవాడు అతని బాధ తట్టుకోలేక అతని నెంబర్ ను వైభవి బ్లాక్‌లో పెట్టింది, అయిన సందీప్ వే ర్వేరు నంబర్‌ల నుండి తరచు ఆమెకి కాల్ చేసి బెదిరించేవాడు. ఆమెను చంపేసి తను ఆత్మహ త్య చేసుకుంటానని బెదిరిస్తూ మెసేజ్‌లు పంపుతుండేవాడు. సందీప్ టార్చర్‌ను భరించలేక మే నెలలో వైభవి తన సోదరుడు, తల్లితో కలిసి హై దరాబాద్‌లోని మియాపూర్ ఆదిత్యనగర్‌లో ని వాసం ఉంటుంది.

కాగా..మంగళవారం ఉదయం 10.30 గం సమయంలో మియాపూర్‌లోని వైభవి ఇంటికి వచ్చిన సందీప్ తల్లీ కూతుర్లతో గొడవపడి ఇద్దరిపై కత్తితో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచి, ఆ తర్వాత తను గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డడు. గాయాలపాలైన తల్లీ కూతుర్లను చికిత్స నిమిత్తం కొండాపూర్‌లోని కిమ్స్ హస్పిటల్‌కు తరలించారు. సందీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని గాంధీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News