Friday, December 20, 2024

పోలీస్ కస్టడీకి హరిహరకృష్ణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థి హరిహరకృష్ణను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ రంగారెడ్డి కోర్టు అనుమతించింది. తమ ప్రేమకు అడ్డుతగులుతున్నాడని ప్రాణ స్నేహితుడైన నవీన్‌ను హరిహరకృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడు చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ ఖైదీగా ఉన్నాడు.

నిందితుడి నుంచి హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు కస్టడీ కోరారు. ఇద్దరు స్నేహితులను ప్రేమించిన యువతి పోలీసుల విచారణకు సహకరించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడంలేదు. దీంతో హరిహరకృష్ణను విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి కస్టడీ ముగిసిన తర్వాత ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ త్వరగా ముగిసేలా చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News