Sunday, January 19, 2025

ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రి గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత ఫుట్‌బాల్ టీమ్‌కు పెద్ద దిక్కుగా ఉన్న ఛెత్రి వచ్చే నెలలో ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించాడు. జూన్ 6న కువైట్‌తో జరిగే మ్యాచ్ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని ఛెత్రి గురువారం వెల్లడించాడు. ఈ మేరకు అతను ఓ వీడియోను పోస్టు చేశాడు.19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో తీపి జాపకాలు ఉన్నాయన్నాడు.

వ్యక్తిగతంగా తాను ఇన్నేళ్లపాటు భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తానని ఊహించలేదన్నాడు. ఈ క్రమంలో తీపి, చేదు జ్ఞాపకాలను తాను చవిచూశానన్నాడు. ఏ ఆటగాడికైనా ఏదో ఒక రోజు ఆటకు వీడ్కోలు పలకక తప్పదన్నాడు. ప్రస్తుతం తనకు ఇలాంటి పరిస్థితి తప్పడం లేదన్నాడు. రిటైర్‌మెంట్ గురించి తన తల్లికి, భార్యకు చెప్పానని, దీంతో వారు కన్నీరు పెట్టుకున్నారని పేర్కొన్నాడు.జాతీయ జట్టు కోసం ప్రతి క్షణం కష్టపడ్డానని, అయితే ప్రస్తుతం తనకు ఫిట్‌నెస్ సహకరించడం లేదని,దీంతో ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు వివరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News