Monday, November 18, 2024

బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ :మంచిగా ఉన్న రోడ్డుపై నూతనంగా రోడ్డు వేయడం.. కాల్వలు భాగున్నప్పటికీ వాటిని ధ్వంసం చేసి కొత్తగా కాల్వలు కట్టడం పరిపాటే.. కానీ దశాబ్దాలు గడుస్తున్నా తమ తండాకు కనీసం బీటీ రోడ్డుకు కూడా నోచుకోలేదంటూ తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరు వర్షాలకే రోడ్డంతా చిత్తడిగా మారి నడవాడానికీ కూడా వీలు పడని దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ రోడ్డుపై నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు ఆ తండావాసులు.

వివరాల్లోకి వెలితే.. మహబూబాబాద్ మండలంలోని ఆయోధ్య గ్రామపంచాయతీ పరిధిలోని భజనతండాకు వెళ్లే దారి నిన్న కురిసిన చిన్న వర్షానికే నడువలేని దుస్థితికి చేరుకుంది. దీంతో తాము ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి ఎన్నోమార్లు తీసుకువెళ్లినా రోడ్డు నిర్మించడానికి వారికి మనస్సు రాలేదు. మా గ్రామంలో రోడ్డువేసేందుకు నిధులు మంజూరు చేయించేందుకు వారికి చేతులు రాలేదంటూ నిరసిస్తూ గురువారం ఆ రోడ్డుపై నాట్లు వేసి తమ గోడును బహిర్గతం చేశారు. ఎవరికైనా రోగమో, నోప్పో వస్తే అంబులెన్సు వచ్చే పరిస్థితులు లేవని ఆవేధన వ్యక్తం చేశారు. బడికి కూడా పిల్లలు ఆ బురదలో నడిచి వెళ్లలేని దయనీయ పరిస్థితులున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు, అధికారులు కళ్లు తెరచి యుద్దప్రతిపాదికన రోడ్డు నిర్మించాలని తండా వాసులు కోరుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు జీనుక రవీందర్, రంగన్న, వీరేందర్, రమేష్, చిరంజీవి, హోంజీ, మురళి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News