Friday, September 20, 2024

బొగత సందర్శన నిలిపివేసిన అధికారులు

- Advertisement -
- Advertisement -

వాజేడు: గత మూడు రోజులుగా దంచి కొడుతున్న వానలతో మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మండలంలోని పేరూరు, పూసూరు గోదావరి వంతెన వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో అటవీ ప్రాంతం గుండా వచ్చే వరద నీటితో బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బొగత సందర్శన తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి తెలిపారు. మండలంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతల నుంచి వచ్చే వరద వలన గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పేరూరు గోదావరి వద్ద మంగళవారం రాత్రి 11.43 సెం.మీ లు ఉన్న నీటిమట్టం ఉండగా, బుధవారం ఉదయం 13.60 సెం.మీ లకు చేరుకుంది. అదే విధంగా సాయంత్రం 5 గంటలకు 14.78 సెం.మీ లకు చేరుకుందని సిడబ్లూసి అధికారిలు వెల్లడించారు. గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో మండలంలోని అధికారులు అప్రమత్తం అవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News