Friday, December 27, 2024

మామూళ్ల మత్తులో సివిల్ సప్లై అధికారులు…

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : జిల్లా వ్యాప్తంగా వివిధ మండల పరిధిలోని రేషన్ బియ్యం దందాను అడ్డుకునే వారేరి…పేదల కోసం కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న పిడిఎస్ బియ్యం పక్కదారి పడుతున్న అట్టి రవాణా పై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ జిల్లా పరిధిలోని రేషన్ షాపుల మొత్తం 610 ఉండగా, కొన్ని మండలాల్లో కొంతమంది స్వయంగా డీలర్లు రంగంలో దిగి బహిరంగంగా పీడిఎస్ బియ్యం సేకరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. సివిల్ సప్లై అధికారులు మామూళ్ల మత్తులో మునిగి పోవడంతో కనీస పర్యవేక్షణ కరువైందని గుసగుసలు జోరుగా సాగుతున్నాయి. దీనిని అదునుగా చేసుకున్న కొందరు అధికారులు యథేచ్ఛగా దందా చేస్తూ డబ్బులు సంపాదించుకుంటాన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆహార భద్రత కోవిడ్ విపత్కర పరిస్థితుల కారణంగా ఉపాధి కోల్పోయిన వారి కోసం కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది రేషన్ డీలర్లు, దళారులు, వ్యాపారులు, సామాన్యుల నుండి కిలో ఐదు రూపాయలు నుండి ఏడు రూపాయలకు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొందరు దళారులు బియ్యాన్ని లబ్ధిదారుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమ వ్యాపారం సూర్యాపేట, చివ్వెంల, మోతె, పెన్‌పహాడ్, నూతనకల్, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం, పాలకీడు, చింతలపాలెం, కోదాడ తదిదత ప్రాంతాలలో నిత్యం జరుగుతున్నట్లు సమాచారం.

వీటికి ప్రధాన కేంద్రంగా పెన్‌పహాడ్, ఆత్మకూర్, చింతలపాలెం, జాజిరెడ్డిగూడెం, నూతనకల్ మండలంలో అక్రమార్కులు ప్రధాన కేంద్రంగా చేసుకుని అక్కడి నుంచి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. పేదలకు చేరాల్సిన బియ్యం అక్రమార్కులకు చేరుతున్నాయి. పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని ఇళ్ల వద్దనే చిన్నచిన్న మిల్లులు ఏర్పాటు చేసి వాటిని నూకలుగా మారుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎవరూ గుర్తు పట్టకుండా క్వింటాళ్ల కొద్ది కొనుగోలు చేసి ఇలా మార్పిడి (నూర్పిడి) చేసి లక్షలు సంపాధిస్తున్నారు.
బియ్యంలోనూ కల్తీ…
జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలలో బియ్యంలోనూ పిడిఎస్ బియ్యాన్ని కలుపుతున్నట్లు సమాచారం. బియ్యాన్ని గుర్తు పట్టకుండా పాలిష్ చేసి వాటిని బియ్యంలో కలిపి కల్తీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బియ్యం కొనుగోలు చేసి అక్రమ వ్యాపారం చేస్తుంటే ఇదే బియ్యాన్ని నూకలుగా మార్చడం మరి కొందరు పిడిఎస్ బియ్యాన్ని పాలిష్ చేయించి బియ్యంలో కలిపి విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ రేషన్ బియ్యం దందా రేషన్ డీలర్లు మరియు వ్యాపారస్తుల పై దళారీ వ్యవస్థ సంబంధిత జిల్లా సంబంధిత అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News