Wednesday, January 1, 2025

ముంబైలో బిజెపియేతర సిఎంల భేటీ

- Advertisement -
- Advertisement -

Meeting of non-BJP CMs in Mumbai

 

ముంబై : త్వరలోనే దేశంలోని బిజెపియేతర ముఖ్యమంత్రుల సమావేశం ముంబైలో జరుగుతుంది. ఈ విషయాన్ని శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఆదివారం విలేకరులకు తెలిపారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని , కేంద్రంలోని బిజెపి సారథ్యపు ప్రభుత్వ వైఖరితో తలెత్తుతున్న సమస్యలను ఈ సమావేశంలో సమీక్షిస్తారని వివరించారు. బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల సిఎంలందరికీ ఇటీవలే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ లేఖలు రాశారు. అంతా ఒక్కచోట సమావేశం కావాలని కోరారు. ఈ మేరకు ముంబైలో ఈ సమావేశం త్వరలో ఏర్పాటు అవుతుంది. తేదీని ఖరారు చేసి వెల్లడిస్తామని రౌత్ తెలిపారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వంటి పలు సమస్యలు రగులుతున్నాయి. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ప్రతిపక్ష నేతలపై వేధింపులకు వీటిని వాడుకోవడం జరుగుతోంది. రాజకీయ స్వార్థంతో కేంద్రంలోని అధికార పార్టీ మతపరమైన వైషమ్యాలను, విభేధాలను రగిలిస్తోందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News