Monday, December 23, 2024

మోడీ డిగ్రీపై వ్యాఖ్యల కేసు..కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : ప్రధాని మోడీ డిగ్రీ అంశంలో వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసి తమ విశ్వవిద్యాలయానికి పరువు నష్టం కలిగించాయని గుజరాత్ యూనివర్శిటీ దాఖలు చేసిన కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో వీరిపై చర్యలు తీసుకోకుండా స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరవుతాయని సెషన్స్ కోర్టులో మీరిద్దరూ హామీ ఇచ్చారని, కానీ మీరు కోర్టుకు రావట్లేదని కోర్టు అసహనం వ్యక్త చేసింది. ఈ కేసులో వీరిపై మెట్రోపాలిటన్ కోర్టు తీసుకుంటున్న చర్యలపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ పరువు నష్టం కేసులో విచారణ కోసం ఆగస్టు 11న మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరు కావాలని గతంలో కోర్టు వీరికి సమన్లు జారీ చేయగా,

ఈ సమన్లను సవాల్ చేస్తూ వీరిద్దరూ సెషన్స్ కోర్టులో రివిజన్ అప్లికేషన్ దాఖలు చేశారు. అయితే వీరి అభ్యర్థనను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. దాంతో వీరు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వీరికి ఊరట లభించలేదు. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించవలసిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో తీర్పు వెల్లడించింది. సర్టిఫికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని కేజ్రీవాల్‌కు అందజేయాలని ఏడేళ్ల క్రితం కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు సమాచార హక్కును దుర్వినియోగం చేశారంటూ కేజ్రీవాల్‌కు రూ. 25 వేలు జరిమానా విధించింది. అయితే ఈ తీర్పు తరువాత తమ విద్యాలయాన్ని లక్షంగా చేసుకుని కేజ్రీవాల్; సంజయ్ అవమానకర వ్యాఖ్యలు చేశారని గుజరాత్ యూనివర్శిటీ వీరిపై పరువు నష్టం దావా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News