Monday, December 23, 2024

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఫస్ట్ ఓట్’ కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో ‘ఫస్ట్ ఓట్ ‘ కార్యక్రమం ప్రారంభమయ్యింది. మొదటిసారిగా ఓటు వేసేవారికి వారి ఓటు హక్కుతో సాధికారత కల్పించడానికి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడ్తున్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ మొదటి సారి ఓటరుగా నమోదు చేసుకోవడానికి సహాయం చేయడం, ప్రోత్సహించడం ఈ కార్యక్రమంలో భాగమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, ఎఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి సమక్షంలో ఇందుకు సంబంధించిన ట్రక్కులను ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణ అంతటా ఈ ట్రక్కులు ప్రయాణిస్తాయని, యువ ఓటర్లు ఎక్కువగా ఉండే కళాశాలలు, ట్యూషన్ హబ్‌లు, బస్ స్టేషన్లు, మాల్స్ లను సందర్శిస్తాయన్నారు. యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించే మా మిషన్‌లో మాతో చేరాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘ శక్తి సూపర్ షి‘ పోస్టర్ ను ప్రారంభించారు. ‘శక్తి సూపర్ షి’  కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో నిర్వహించి మహిళల హక్కులను కాపాడుతామన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు మహిళలతో జాతీయ జెండాను ఆవిష్కరింపచేయనున్నట్లు తెలిపారు. ‘ శక్తి సూపర్ షి’ కార్యక్రమం ద్వారా రాజకీయాలలో మహిళలను ప్రోత్సహిస్తామన్నారు.

Shakti super she

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News