Thursday, January 2, 2025

లోక్‌సభలో ప్రధానికి బిజెపి ఎంపీల ఘన స్వాగతం

- Advertisement -
- Advertisement -

BJP MPs give warm welcome to Prime Minister in Lok Sabha

మోడీ నామస్మరణతో మార్మోగిన లోక్‌సభ

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయకేతనం ఎగురవేసిన తరువాత సోమవారం ప్రారంభమైన రెండవ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీకి బిజెపి ఎంపీలంతా హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల తర్వాత సభలోకి మోడీ అడుగుపెట్టగానే బిజెపి ఎంపీలంతా లేచి నిలబడి బల్లలు చరుస్తూ మోడీ..మోడీ అంటూ నినదిస్తూ స్వాగతం పలికారు.సభలో ప్రధానికి స్వాగతం పలికిన బిజెపి ఎంపీలతో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తోసహా కేంద్ర మంత్రులందరూ గొంతు కలిపారు. సభలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర ప్రతిపక్ష సభ్యులు కూడా ఆ సమయంలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం లోక్‌సభ సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో బిజెపి గెలుపొందగా పంజాబ్‌లో ఆప్ విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News