Thursday, December 19, 2024

వార ఫలాలు 12-05-2024 నుండి 18-05-2024 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:    మేషరాశి   వారికి  ఈ వారం చాలా బాగుంది.  ప్రతి విషయాన్నీ నెగిటివ్ కాకుండా పాజిటివ్ గా ఆలోచించాలి.నూతన బాధ్యతలు, ఉద్యోగస్తులకు ఈవారం బాగుంది. పిల్ల పట్ల శ్రద్ధ తీసుకోవాలి,  కీళ్ళ నొప్పులు, ఎముకలకు సంబంధించిన నొప్పులు ఇబ్బందిపెడతాయి. ఆయుర్వేద వైద్యం వలన దీనికి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ వలన చెప్పుకోదగిన ప్రయోజనం కలుగదు.ప్రయాణాలు దూరప్రాంత అవకాశాలు కలిసి వస్తాయి.  నిర్మాణపరమైన పనులలో జాప్యం జరుగుతుంది. ఇందువల్ల ఇతరత్రా సమస్యలు తలెత్తుతాయి.వ్యాపారస్తులకు ఈవారం లాభసాటిగా వుంది. అనుకున్న పనులు విజయంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా వుంది,

వృషభం:  వృషభ రాశి వారికి  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మీ మనస్సును ఎంతగానో కలచి వేస్తాయి.  వాతావరణంలో స్వల్పమార్పు వచ్చినా అది మీ ఆరోగ్యం మీద, వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపుతుంది. మొండి బాకీలకు సంబంధించిన వ్యవహారాలు కొత్త మలుపులు తిరుగుతాయి. ఉద్యోగస్తులకు ఈ వారం సామాన్యంగా ఉంటుంది.  విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి.  వారాంతంలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలు సమసిపోతాయి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుంది.   సంతాన పురోగతి బాగుంటుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా వుంది, రాజకీయ రంగంలో ని వారికీ మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఆశిస్తారు.

మిథునం:   మిథునరాశి వారికి  ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక, వ్యాపార లావాదేవీల మీద మనస్సును కేంద్రీకృతం చేస్తారు. ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. సాఫ్ట్వేర్, మెడికల్ రంగంలో వారికీ ఈ వారం బాగుంది. చదువుకోవాలని అనుకున్నవారికి ఆర్ధిక సహాయం చేస్తారు. ఆత్మీయులు, సహోదర, సహోదరీ వర్గం వారు తప్పులు చేసినా వెనకేసుకొస్తారు. తోటివాళ్ళ ముందు ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి దేనిని లెక్కజేయ కుండా శ్రమిస్తారు. మంచి  ఫలితాలు సాధిస్తారు. వివాహ విషయాలు కొంత వాయిదా వేయడం మంచిది. విద్యార్థిని విద్యార్థులు మీరు అనుకున్న విద్యను పూర్తి చేయగలుగుతారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి విశేషంగా శ్రమిస్తారు. కుటుంబ బరువుబాధ్యతలలో భాగం పంచుకుంటారు. ఈ రాసి వారు సుబ్రమణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి  ఈ వారం అనుకూలంగా ఉంది. పలుకుబడి, డబ్బు ఎంత పనినైనా సులభ సాధ్యం చేస్తుందని గ్రహిస్తారు. మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు సొంతంగా చేసే వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. ఓర్పు, సహనం పాటించాలి. కోపతాపాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. విద్య పరంగా అభివృద్ధి బాగుంటుంది.
ఆరోగ్య పరంగా ప్రత్యేక  జాగ్రత్తలు తీసుకుంటారు. యోగా, మెడిటేషన్‌ వంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. స్త్రీలుకు కొద్దికాలం గైనకాలజి సమస్యలతో బాధపడతారు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది.

సింహం: సింహరాశి వారికి ఈ వారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాదాలు, వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. అభిమానించి నెత్తిన పెట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. మీలో పట్టుదల పెరుగుతుంది. నరదృష్టి అధికంగా ఉంటుంది.  వారసత్వపు హక్కులు సంక్రమిస్తాయి. మానసిక ప్రసన్నత ఏర్పడుతుంది. కుటుంబంతో  కలసి విహార యాత్రలు చేస్తారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులు ఉద్యోగపరంగా కొంతకాలం సెలవులో వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. వాలంటరీ రిటైర్మెంట్  గురించి ఆలోచిస్తారు. క్రీడారంగంలో మంచి ఖ్యాతి, గుర్తింపు లభిస్తాయి. రాజకీయ రంగంలో వారికీ విజయం సాధిస్తారు. విద్యార్థిని విద్యార్థులు మీరు అనుకున్న విద్యను పూర్తి చేయగలుగుతారు. CA చదువుకోవాలన్న వారి కల నెరవేరుతుంది. ఈ రాశి వారు విష్ణు ఆలయంలో అర్చన చేయడం చెప్పదగిన సూచన,

కన్య:    కన్య రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. విద్య పరంగాను, పోటీ పరీక్షలలోను వాళ్ళ పురోగతి బాగుంటుంది.  దైవబలం వుంది. మీ మనోధైర్యం ముందు కొండలాంటి సమస్యలు కూడా రాళ్ళ లాగా కనబడతాయి. ఆత్మీయ వర్గంతో ఘర్షణలు పడకూడదని ఎంతగానో ఓర్పు వహిస్తారు. ప్రేమ వివాహ విషయంలో జాగర్తలు తీసుకోండి. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్థిరాస్తులను అమ్మి వేరే చోట స్థిరాస్తులను కొనుగోలు చేయాలనీ చూస్తారు.  గ్రీన్ కార్డు, h1b వీసా కోసం ప్రయత్నం చేసేవారికి కొంత నిరాశే ఎదురవుతుంది.     వివాహం కాని వారికి సంబంధాలు దగ్గర దాకా వచ్చి చేయి జారిపోతాయి.
ఈ రాశి వారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

 

తుల: తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార సంబంధమైన లావాదేవీలలో మీ భాగస్వాముల తొందరపాటు వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. రాజకీయంగా మీ వల్ల లాభం పొందిన వారు కొండంత అండగా నిలుస్తారు. కీళ్ళరోగాలు ఇబ్బంది పెట్టవచ్చు. మంచి ఆలోచనలను ఆచరణలోనికి తెస్తారు. ప్రయోజనం పొందుతారు.  విద్యార్థిని విద్యార్థులకు ఎంతో కాలంగా మీరు ఎదురుచొస్తున కల నెరవేరిందని ఎంతగానో సంతోష పడతారు దానికి  మీ తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందని గుర్తు పెట్టుకోండి. h1b, వీసా కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచన కనిపిస్తోంది.ఈ రాశీ వారు హనుమాన్ చాలీసా పఠించడం,

వృశ్చికం:    వృశ్చికరాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. విదేశాలలోచదువుకోవాలనుకునే మీ యొక్క ఆశయం రెండవ ప్రయత్నంలో నెరవేరుతుంది.  ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వస్తే వేరే సమస్యలు ప్రారంభం అవుతాయి. గృహ నిర్మాణ, భూమి కొనుగోలు మొదలైన విషయాలు నెమ్మదిగా సానుకూల పడతాయి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది, నూతన వ్యాపార ప్రయత్నాలను కొద్దీ కాలం  పాటు వాయిదాను వేసుకోవడం మంచిది,  విద్యార్థిని విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి, పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. రాజకీయ, సామాజిక సేవారంగాలకు సంబంధించిన పదవులు లభిస్తాయి. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం అలాగే ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

 

ధనస్సు:   ధనస్సు రాశి  వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో పురోగతి బాగుంటుంది. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది అయితే ఆలోచిస్తారు. సంతానం వల్ల మనః సంతోషం కలుగుతుంది.  కష్టపడి సంపాదించిన సొమ్ము  దురవ్యసనాలు ఖర్చు అవుతుంటే ఏమీ చేయలేని పరిస్థితి గోచరిస్తోంది. పాస్‌పోర్ట్‌, వీసా వంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి.  ఆరోగ్యపరమైన సమస్యలు వేధిస్తాయి. కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. ఆ విషయంలో తగు జాగ్రత్త వహించండి. ఆత్మీయులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. కీలక సమయంలో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారు. ఈ రాశివారు విష్ణు ఆలయంలో అర్చన చేయడం చెప్పదగిన సూచన,

మకరం: మకరరాశి వారికి  ఆర్థిక పురోగతి సాధిస్తారు. విదేశాలలో నివసించే వారికి గ్రీన్‌కార్డు లభిస్తుంది. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.  స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న సామెత మీ విషయంలో నిజమవుతుంది. రహస్యంగా సహోదర, సహోదరీ వర్గానికి సహాయం చేస్తారు. వాటి వలన భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం వుంది . శ్రావణ మాసంలో శుభకార్యాలు చేయాలని అనుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం సాధించగలుగుతారు. శత్రువులను కూడా మిత్రులను చేసుకుని  మంచి ఖ్యాతిని సంపాదిస్తారు. వారసత్వపు హక్కులు లభిస్తాయి. ప్రభుత్వ పరమైన లీజులు, లైసెన్సులు పొడిగించబడతాయి. జీవితంలో నూతన కోణాలను ఆవిష్కరించాలని ప్రయత్నిస్తారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పోటీ పడాల్సి వస్తుంది. రాజకీయ రంగంలో వారికీ ఈ వారం బాగుంది, 8 శని వారలు శని కి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దూరప్రాంతంలో ఉన్న వారితో సత్సంబంధాలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాల పరంగా నూతన వ్యూహాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.  సంతానాన్ని అతి గారాబం చేస్తారు. క్రమశిక్షణాయుతమైన జీవితంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను క్రమం తప్పకుండా అమలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలలో అవలీలగా విజయం సాధించగలుగుతారు. చిన్నచిన్న ఒడిదుడుకులకు కృంగిపోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. స్నేహితుల విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఆరోగ్యం పట్ల జాగ్రతలు తీసుకోవాలి, అశ్రద్ధవహించకండి,   8 శని వారలు శని కి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన.

మీనం: మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి, కీర్తిప్రతిష్టలు  గడిస్తారు. బంధుమిత్రుల సమావేశంలో మీ జీవిత భాగస్వామి కీలక పాత్ర వహిస్తుంది. విందులు, వినోదాలు ఏకాంత చర్చలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యతిరేక వాతావరణం ఏర్పడుతుంది. సొంత మనుషుల నుండి సమస్యలు రావడం జరుగుతుంది. నమ్మక ద్రోహాన్ని నమ్మక ద్రోహంతోనే జయించాలని నిశ్చయించుకుంటారు.  రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు లాభిస్తాయి.  రాహు గ్రహ అనుకూల ప్రభావం చేత దూరప్రాంత విషయాలు, ఎగుమతి, దిగుమతి వ్యవహారాలు లాభిస్తాయి. రాజకీయ పరమైన వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి, దక్షిణమూర్తి శ్లోకాన్ని నిత్యం పఠించండి చెప్పదగిన సూచన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News